'బాహుబలి' గురించి మళ్లీ ఇంకోసారి మహేష్‌బాబు

By Srikanya

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత జానపద చిత్రం 'బాహుబలి'. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్న ఈ చిత్రంపై సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపించారు. అయితే మరోసారి ఆయన ఈ చిత్రం గురించి అందులో విజువల్ ఎఫెక్టుల గురించి మాట్లాడారు.హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సినిమా గురించి స్పందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ మాట్లాడుతూ.. బాహుబలి చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్‌లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఇలాంటి సినిమాను కేవలం రాజమౌళి మాత్రమే తీయగలరని పేర్కొన్నారు. రాజమౌళితో ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే జక్కన్న దర్శకత్వంలో చిత్రం ఉంటుందని వెల్లడించారు.

Mahesh again talked about Baahubali

ఇక మహేష్ తాజా చిత్రం'శ్రీమంతుడు' విషయానికి వస్తే....

వూరిని దత్తత తీసుకోవాలనే ఓ చక్కటి సందేశం చుట్టూ సాగే కథ ఇది. శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఆడియో పంక్షన్ జరిగింది.

చిత్రం కాన్సెప్టు ఏమిటీ అంటే....వూరు చాలా ఇచ్చింది. అందమైన బాల్యాన్ని, మర్చిపోలేని స్నేహాన్నీ, వదులుకోలేని జ్ఞాపకాల్ని. ఇన్నిచ్చిన వూరుకి తిరిగి ఏమిచ్చాం..? రెక్కలొచ్చి వెళ్లిపోయాక.. పండగలకీ పబ్బాలకీ సొంతూరెళ్లి - మహా అయితే సెల్ఫీ దిగొచ్చాం. అంతేగా..? అందుకే.. 'వెలకట్టలేని ఆస్తిని ఇచ్చిన వూరికి మనమూ ఏదోటి తిరిగివ్వాలి..' అని చెప్పడానికి 'శ్రీమంతుడు' వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

మహేష్‌బాబు మాట్లాడుతూ... ''అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. వాళ్ల కోసం మంచి సినిమాలు చేసేందుకే ప్రయత్నిస్తుంటా. పోయినసారి కాస్త నిరుత్సాహపరిచాను. అందులో నా తప్పుంటే క్షమించండి. దేవి అంటే నాకు చాలా ఇష్టం. 'జాగో జాగో...' పాట నా కెరీర్‌లోనే ఉత్తమ గీతంగా నిలుస్తుంది. కొరటాల శివ అద్భుతమైన రచయిత. నాకు చెప్పినదానికంటే బాగా తీశాడు. 'శ్రీమంతుడు' లాంటి సినిమా నాతో తీసినందుకు కృతజ్ఞతలు.

అలాగే ఈ సినిమా ఒప్పుకొన్నందుకు జగపతిబాబుగారికి కృతజ్ఞతలు. ఆయన తప్ప మరొకరు సెట్‌ అవ్వని పాత్ర అది. రాజేంద్రప్రసాద్‌గారు, సుకన్యగారు, రాహుల్‌ రవీంద్రన్‌ లాంటి నటులతో కలసి నటించడం చక్కటి అనుభవం. కమల్‌ హాసన్‌గారికి పెద్ద అభిమానిని. ఆయన కూతురితో కలసి సినిమా చేస్తాననుకోలేదు. అభిమానులు ఈసారి నా పుట్టినరోజుకి పెద్ద కానుక ఇస్తారని ఆశిస్తున్నాను''అన్నారు.

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ... ''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.

శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X