మహేష్ ముందుగా..బన్నీ లేటుగా..కాలా ఎఫెక్ట్!
వేసవి సినిమాల విడుదల తేదీల లెక్క తేలడం లేదు. టాలీవుడ్ నుంచి ఇద్దరు బడా హీరోలు మహేష్, బన్నీ ఏప్రిల్ 27 తేదీని ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆ తరువాత రజినీకాంత్ 2.0 చిత్ర బృందం అదే తేదీన తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి భరత్ అనే నేను, నాపేరు సూర్య చిత్ర విడుదల తేదీల్లో సందిగ్దత కొనసాగుతోంది. సూపర్ స్టార్ రజిని ప్రభావం ఎంతోకొంత మన హీరోల ఓపెనింగ్స్ పై పడుతుంది. కానీ 2.0 చిత్రం పక్కకు వెళ్లి ఆస్థానంలో రజిని 'కాలా'గా అదే తేదీన రాబోతున్నాడు. రజినీకాంత్ ఏప్రిల్ 27 న రావడం ఖాయంగా కనిపిస్తుండడంతో మహేష్, బన్నీ చిత్రాల విడుదల తేదీల్లో సర్దుబాట్లు జరిగినట్లు తెలుస్తోంది.

ముందుగా రిజర్వ్ చేసుకున్నారు
ఏప్రిల్ 27 తేదీని బన్నీ, మహేష్ ఇద్దరూ ముందుగా రిజర్వ్ చేసుకున్నారు. ఇద్దరుస్టార్ హీరోల చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం మంచింది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న తరుణంలో రజిని ఎంట్రీ ఇచ్చాడు.

2.0 వాయిదా
రజిని కాంత్ 2.0 చిత్రం వాయిదా పడడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కాలా చిత్రంతో అడుగు పెట్టబోతున్నాడు.

వదలడానికి ఇష్టపడని బన్నీ, మహేష్
వాస్తవానికి తాము ముందుగా రిజర్వ్ చేసుకున్న తేదీని రజిని ఆక్రమించడంతో భరత్ అనే నేను, నాపేరు సూర్య చిత్ర నిర్మాతలు నిరాశకు గురయ్యారు. రజిని కాలా చిత్ర విడుదల తేదీ మారే పరిస్థితి కనిపించకపోవడంతో బన్నీ , మహేష్ సర్దుబాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త విడుదల తేదీలు
తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు భరత్ అనే నేను చిత్ర విడుదల ఏప్రిల్ 21 కి ప్రీపోన్ అయినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ నాపేరు సూర్య చిత్రం మే 5 కు పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. కొత్త విడుదల తేదీలపై అధికారిక సమాచారం రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











