బలంగా తిరిగిరావాలి బ్రదర్: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ప్రేమతో మహేష్, నాగశౌర్య ఎమోషనల్, టాప్ డైరెక్టర్స్ కూడా
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడంతో అభిమానులు కొంత ఆందోళన చెందారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలని టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
Recommended Video

అప్పుడు ఒక్క తారక్ మాత్రమే మిస్సయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్స్ లలో పాల్గొంటున్నాడు. ఫస్ట్ వేవ్ ఉన్నప్పటికీ రెగ్యులర్ గా RRRతో బిజిగానే ఉన్నాడు. అయితే ఆ సినిమాకు వర్క్ చేసిన చాలామంది కోవిడ్ బారిన పడ్డారు. కానీ అప్పుడు ఒక్క తారక్ మాత్రమే కరోనా కాటుకు గురవ్వకుండా వచ్చాడు.

ఎక్కువగా వైరల్ అవ్వకముందే
ఇక ఫైనల్ గా ఈ రోజు కొంత అస్వస్థతకు గురవ్వడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇక రూమర్స్ ఎక్కువగా వైరల్ అవ్వకముందే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ఫ్యామిలీ మొత్తం కూడా ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

తారక్ స్టార్ హీరోల ప్రేమ
ఇక జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలని కేవలం అభిమానులే కాకుండా స్టార్ సెలబ్రెటీలు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఇక మహేష్ బాబు నుంచి నాగ్ శౌర్య వరకు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.

బ్రదర్.. అంటూ మహేష్ ట్వీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏలాంటి సందర్భంలో అయినా తోటి నటీనటులపై తనదైన శైలిలో ప్రేమను చూపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , మెగాస్టార్, రాజమౌళి వంటి వారు కోవిడ్ బారిన పడినప్పుడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా త్వరగా కొలుకోవాలి బ్రదర్ అంటూ.. బలంగా రావాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

నాగ శౌర్య అభిమానం
ఇక హీరో నాగ శౌర్య కూడా ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడతాడు. దీంతో తన అభిమాన హీరోకు కరోనా వచ్చింది అనగానే స్పందించాడు.. ' క్షేమంగా కోలుకోవాలని అనుకుంటున్నాను తారక్ అన్నా. మా ప్రేమ, ప్రార్ధన ఎల్లప్పుడూ నీతో ఉంటాయి. మళ్ళీ నువ్వు బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను'.. అని నాగ శౌర్య వివరణ ఇచ్చారు.

దర్శకులు కూడా..
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అలాగే, నిర్మాత నాగ వంశీ, డైరెక్టర్స్ బాబీ, అనిల్ రావిపూడి, సంపత్ నంది, హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ అలాగే పలువురు బీజేపీ నాయకులు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.


Click it and Unblock the Notifications











