»   » మహేష్ నెక్ట్స్ పాకిస్దాన్ లో...

మహేష్ నెక్ట్స్ పాకిస్దాన్ లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మన తెలుగు సినిమాలు పాకిస్ధాన్ లో రిలీజ్ అవ్వటం అరుదు. అందులోనూ అవి హిందీలోకి డబ్ అయితేనే అక్కడ విడుదల అయ్యే అవకాసం ఉంటుంది. అయితే మహేష్ సినిమాలు నెక్ట్స్ టైమ్ పాకిస్ధాన్ లో రిలీజ్ అయ్యే అవకాసం ఉందని అంటున్నారు. దానికి కారణం నిన్న జరిగిన ఛాట్ లో ఓ అబిమాని అడిగిన ప్రశ్న.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అన్వర్ అనే పాకిస్ధానీ అభిమాని ...సార్ నేను పాకిస్ధాన్ నుంచి మాట్లాడుతున్నా నేను మీకు వీరాభిమానిని, పాకిస్ధాన్ లో చాలా మంది మీకు అభిమానులు ఉన్నారు. నా రిక్వెస్ట్ మీ సినిమాలు హిందీ డబ్ వెర్షన్ లు పాకిస్ధాన్ లో విడుదల చెయ్యాలని ప్లీజ్ అన్నారు. దానికి మహేష్ బాబు సమధానంగా తప్పకుండా నెక్ట్స్ టైమ్ చూస్తాను అని హామీ ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ సినిమా హిందీ డబ్ వెర్షన్ పాకిస్ధాన్ లో విడుదల అయ్యే అవకాసం ఉందని అంటున్నారు.


Mahesh answer to Pakistan fans

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫేస్ బుక్ ద్వారా లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. మీ దృష్టిలో విజయానికి కొలమానం ఏమిటి అనే ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ... మంచి కథే సినిమా విజయానికి కొలమానం అని సమాధానం ఇచ్చారు.


అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ బాబు స్పందిస్తూ... శ్రీమంతుడు స్టోరీ విన్నపుడు స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ స్టోరీ అనిపించింది. హర్ష లాంటి క్యారెక్టర్ గతంలో ఎవరూ చేయలేదనిపించింది అన్నారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ శ్రీమంతుడు సినిమాలో తన కూతురు సితారకు రామ రామ సాంగ్ బాగా నచ్చిందని, సినిమాలో నేను చేసినట్లే డాన్స్ చేస్తుంటుంది అన్నారు.


శ్రీమంతుడు సినిమాలో తన ఫేవరెట్ సీన్ గురించి చెబుతూ... ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ జగపతి బాబుతో నాకు బాగా నచ్చిన సీన్ అన్నారు. తన ఫేవరెట్ హీరో ఎప్పటికీ తన తండ్రే అని మహేష్ బాబు స్పష్టం చేసారు. నా సినిమాలో ఆయనకు బాగా నచ్చిన సినిమా ఇపుడు ‘శ్రీమంతుడు' అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమన్నారు. తన ఫేవరెట్ హాలిడే స్పాట్ సింగపూర్ అని మహేష్ బాబు తెలిపారు.

English summary
Zunaira Anwer : Hello sir I m from Pakistan I m big fan of your. Huge amount of fans of your are also here in Pakistan I request you to plz release your Hindi dudded version of your movies in Pakistan plz, Mahesh Babu:Thank you. We will definitely look at it next time.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu