మహేష్ బాబు - అనుష్కల గురించి జోష్యం!
టాలీవుడ్ యువరాజ్ మహేష్ బాబు, అందాల తార అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం తప్పకుండా బంపర్ హిట్ అవుతుందని సినీ పండితులు చెబుతున్నారు. కాగా ప్రిన్స్ మహేష్ బాబు, బిల్లా సుందరి అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ పూణేలో జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూణే, మహారాష్ట్ర గ్రామ ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను సింగనమల రమేష్ బాబు కనకరత్న మూవీస్ పై నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి పాటల చిత్రీకరణ జరుగుతోందని శ్రీనివాస్ తెలిపారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మాణ్యం, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు తెలియజేశారు.
అరుంధతి బంపర్ హిట్ తర్వాత అనుష్క నటించిన వేదం, పంచాక్షరి చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ చిత్రాలు అనుష్కకు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన అనుష్క నటిస్తోన్న తాజా చిత్రం కూడా బంపర్ హిట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. అలాగే 'అతడు" తర్వాత అనుష్క-మహేష్ బాబుల బ్లాక్ బస్టర్ మూవీ కోసం అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











