టాక్సీ డ్రైవర్ గా మహేష్ బాబు!!(స్పెషల్)

By Staff

Mahesh Babu
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈసారి మహేష్ బాబుని టాక్సీ డ్రైవర్ గా చూపించనున్నారని తెలుస్తోంది. నవంబర్ 19 నుండి ప్రారంభం కానున్న ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా శ్రియ శరణ్ ని గానీ సియా(నేనింతే హీరోయిన్)ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పాత్ర డాక్టర్ అని చెప్తున్నారు. అయితే మొయిన్ రోల్ వేసే పార్వతీ మిల్టన్ పాత్రే హైలెట్ గా ఉంటుందంటున్నారు.

అలాగే సినిమా అంతా సాహసాలతో నిండి ఉంటుందనీ,వరుడు అనే టైటిల్ కాక వేరే టైటిల్ కోసం అన్వేషిస్తూనట్లు చెప్తున్నారు. అలాగే శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం మొదట రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభమయి,వరసగా రెండు నెలలపాటు రాజస్ధాన్,పొల్లాచ్చి(తమిళనాడు)లలో జరుగుతుంది.అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలో అంతర్లీనంగా ఉంటుందని సమాచారం. ఇక ఆ తర్వత కొంత గ్యాప్ తర్వాత సౌత్ ఆఫ్రికాలో సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.మే నెలాఖరకు అవి పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రిచ్ గా వేసిన సెట్స్ లో పాటలు తీస్తారు.

ఇక పాటల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ని ప్రభు దేవా సోదరుడు రాజు సుందరం కంపోజ్ చేయటానికి కమిటయ్యాడు. అలాగే మిగతా పాటలు పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ సరోజ్ ఖాన్, వైభవ్ మర్చంట్ తీర్చిదిద్దుతారు. రొమాంటిక్ ఎడ్వంచర్ గా సాగే ఈ కథలో ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు.అలాగే సునీల్...హీరో కి ప్రెండ్ గా మరో కీలకమైన పాత్రను చేయనున్నాడు.

కనకరత్న మూవీస్ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మకంగా శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని పనలు పూర్తి చేసి జూలై 18,2009 కి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ మహేష్ అండ్ త్రివిక్రమ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X