అవును..యూనివర్శల్ హీరోనే...మహేష్ బాబు
మహేష్ తాజాగా యూనివర్ సెల్ మొబైల్ స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇంతకుముందు ఈ చెన్నై బ్రాండ్ ని హీరో మాధవన్ ప్రమోట్ చేసేవాడు. అయితే ఆంద్రాలో ఈ బ్రాండ్ ని పాపులర్ చేయటానికి ఆ కంపెనీ వారు వ్యూహాత్మకంగా మహేష్ ని రంగంలోకి దించారు. ఇందుకోసం హైదరాబాద్..అమీర్ పేట షోరూంలో ఈవెంట్ కండెక్ట్ చేసారు. దానికి మహేష్ అటెండయ్యారు. అప్పుడు ప్రిన్స్ మాట్లాడుతూ..తాను యూనివర్శల్ హీరో అని చమర్కరించారు. అంతే గాక వెండితెర మీద కన్నా ఇలాంటి కార్పోరేట్ ఫంక్షన్స్ లోనే ఎక్కువ కనిపిస్తునన్నారు అంటే..నాకు తెలుసు..మరికొన్ని సినిమాలతో ముందుకు రావాలని..అయితే కొన్ని తప్పించుకోలేని పరిస్ధితుల వల్ల లేటవుతోంది. ఇప్పటి నుంచీ మినిమం రెండు సినిమాలు ఏడాదికి ఇస్తానని హామీ ఇచ్చారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అతిధి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది.


Click it and Unblock the Notifications











