అశ్వనీదత్ ని ఆదుకోవటానికి మహేష్ బాబు
పూర్తి స్దాయి హీరోగా తనకు రాకుమారుడు చిత్రంతో తెరంగ్రేటం చేయించిన అశ్వనీదత్ కి మహేష్ డేట్స్ ఇచ్చారు. శక్తి చిత్రం డిజాస్టర్ అయ్యి పూర్తి నిరాశలో ఉన్న ఆయనకు ఇది ఊరట. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు, క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం పూర్తిగా ఖరారైంది. ఈ చిత్రం ఆగస్టు 9, 2012న మహేష్ పుట్టిన రోజున ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ తన వైజయంతీ బ్యానర్ పై నిర్మిస్తారు. తొలిసారిగా ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. హే రామ్, కంజీవరం, అజాబ్ ప్రేమ్ కీ గజాబ్ కహానీ వంటి చిత్రాలకు పనిచేసి తిరు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తారు. అలాగే ఈ చిత్రం ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ఓ భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపొందనుంది. మహేష్ తండ్రి కృష్ణ కెరీర్‌లో నిలిచిన 'అల్లూరి సీతారామరాజు"లా మహేష్ కెరీర్‌లో ఈ సినిమా నిలిచిపోయేలా ఓ డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్, ఎమోషన్స్ తో చిత్రం ప్లాన్ చేస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కు ఉండబోతున్నారు. ఇక మహేష్ వరుసగా చిత్రాలు కమిటవుతున్నారు. పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న 'బిజినెస్‌మేన్' సంక్రాంతికి వస్తుంది. ఆ తరవాత అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' రెడీ అవుతుంది. ఈ చిత్రం కూడా పూర్తయ్యేసరికి సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం మొదలవుతుంది. వీటి తర్వాత క్రిష్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. దూకుడు చిత్రం సూపర్ హిట్ తర్వాత మహేష్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పుకుని తన అభిమానులుకు ఆనందం కలిగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











