మహేష్ బాబు, పూరి జగన్నాథ్ మూడో సినిమా ఎప్పుడంటే..?

మరో వైపు మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి ఊరిస్తున్న ఈ కాంబినేషన్ చిత్రం ఎట్టకేలకు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఆగస్టు 11న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీస్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు.
వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











