twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైడ్ సంపాదన కోసం బ్యాంకాక్ కి మహేష్

    By Srikanya
    |

    మహేష్ కు మెయిన్ ప్రొపిషన్ సినిమాలు అయితే,సైడ్ సంపాదన యాడ్ ఫిలింలు. దూకుడు,బిజినెస్ మ్యాన్ చిత్రాలు సూపర్ హిట్ కావటంతో మహేష్ బ్రాండిగ్ విలువ మరింతగా పెరిగింది. ఈ నేపధ్యంలో మరో యాడ్ పిలిం షూటింగ్ నిమిత్తం మహేష్ బాబు ఈ నెల(పిబ్రవరి) 13 తేదీ వరకూ బ్యాంకాక్ లో ఉంటారు. అక్కడ ఆయన ధమ్స్ అప్ యాడ్ షూటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత పిబ్రవరి 16 నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొంటారు.

    అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని కుట్రాలంలో జరుగుతుంది. అక్కడ పదిహేను రోజులు షూటింగ్ పూర్తి చేసుకుని అనంతరం రామోజి ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో షూటింగ్ కి షిప్ట్ అవుతారు. ప్రస్తుతం మహేష్ కంటిన్యూగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఓ ప్రక్క సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మరో ప్రక్క సుకుమార్ చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నారు. వీటి తర్వాత పూరి తో బిజినెస్ మ్యాన్ సీక్వెల్ చేస్తారు. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా తన కెరీర్ ని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా ఇలా యాడ్ ఫిలింలు చేస్తున్నారు.

    English summary
    Mahesh’s Schedule at Bangkok for Thumsup Ad Shoot till 13th Feb.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X