»   » నమ్రతగా చేతులు కట్టిన మహేష్...సినిమాలోదా ఈ స్టిల్?

నమ్రతగా చేతులు కట్టిన మహేష్...సినిమాలోదా ఈ స్టిల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ క్రింద మీరు చూస్తున్న స్టిల్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జోరుగా ప్రయాణం చేస్తోంది. మహేష్ చాలా నమ్రతగా నిలబడి ఉన్న స్టిల్ సినిమాలోదా లేక...'మా' అధ్యక్ష్యుడు రాజేంద్రప్రసాద్, మిగతా మెంబర్స్ కలిసి తీయించుకున్న ఫొటోనా అనేది తెలియటం లేదు. అయితే కొందరు మాత్రం ఇధి కొరటాల శివ చిత్రంలోది అంటున్నారు. ఏదనేది మీరూ ఓ లుక్కేసి చెప్పండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక సినిమా విశేషాలకు వస్తే...

మహేష్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్నుంచీ ఈ సినిమాకి 'శ్రీమంతుడు' అనే పేరు ప్రచారంలో ఉంది. అయితే తాజాగా చిత్రబృందం ఆ నిర్ణయాన్ని మార్చుకొని 'మగాడు' పేరుకే ఓటేసింది... మహేష్‌ కూడా ఇదే పేరుకే పచ్చజెండా వూపారు అన్నారు కానీ అది నిజం కాదని తేలింది.

ఈ నెల 31న కృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేస్తారు. జులై 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 Mahesh at the shooting spot?


ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

తాజాగా పూరితో....

" మహేష్ ఫ్యాన్స్ తో ఇది షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మహేష్,నా కాంబినేషన్ లో రూపొందే 3 వ చిత్రానికి స్క్రిప్టు ఫినిష్ చేసాను..హ్యట్రిక్ కు రెడీగా ఉండండి ", అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేసారు. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం సెట్స్‌పైకి రానుందనే సంగతి తెలిసిందే.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సినిమాల తరువాత ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని ఈ ట్వీట్ తో ఖరారు చేసారు పూరి.

ఇక ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవితో పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం వచ్చే ఏడాది మహేష్, పూరి జగన్నాథ్‌ల చిత్రం సెట్స్‌పైకి రానుందని చిత్ర వర్గాల సమాచారం.

English summary
This is the latest photograph from Mahesh Babu's upcoming family entertainer that is doing the rounds on social media.
Please Wait while comments are loading...