మహేష్ బాబు పిల్లలు ఇలా సరదాగా...(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న '1'(నేనొక్కడినే) చిత్రం షూటింగులో భాగంగా లండన్లో గడుపున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, పిల్లలు గౌతం, సితార కూడా అక్కడే ఉన్నారు.

ఈ సందర్బంగా మహేష్ బాబు పిల్లలు సితార, గౌతం వీలైనప్పుడల్లా లండన్ పరిసరాల్లో సరదాగా గడుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. మహేష్ బాబు ఈ ఫోటోలు తన ట్విట్టర్లో పోస్టు చేసాడు. ఇటీవల సితార సంవత్సరం వయసు పూర్తి చేసుకుంది. సితార బర్త్ డే వేడుకలు కూడా ఇక్కడే నిర్వహించారు.

లండన్లో షూటింగులో బిజీగా గడుపుతూనే ఇటు ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మరిన్ని వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

సితార

సితార

మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ దంపతులకు జులై 20, 2012న సితార జన్మించింది. సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు మహేష్ కుటుంబ సభ్యులు. సితార ఇటీవల తన తొలి పుట్టినరోజును జరుపుకుంది.

గౌతం కృష్ణ

గౌతం కృష్ణ

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెర తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ విషయాన్ని మహేష్ బాబు ఓ ప్రెస్ మీట్లో స్పష్టం చేసాడు. తాజాగా గౌతం కృష్ణ‌పై లండన్లో పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు.

బాలనటుడిగా గౌతం

బాలనటుడిగా గౌతం

గౌతం పాతక్ర ఏమిటంటే.... ఈ చిత్రంలో గౌతం కృష్ణ...సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రను పోషించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సీన్లు ఆదివారం చిత్రీకరిచారు. మహేష్ బాబు తనయుడు తెరంగ్రేటం చేసే సినిమా కావడంతో ‘1' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

.మహేష్ బాబు నటవారసత్వం

.మహేష్ బాబు నటవారసత్వం

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా మహేష్ బాబు చిన్న తనంలోనే బాల నటుడిగా వెండి తెర తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో గౌతం మహేష్ బాబు నట వారసుడిగా వెండితెరంగ్రేటం చేయబోతుండటం గమనార్హం. మహేష్ బాబు తనయుడు గౌతం మహేష్ బాబు పోలికలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

సినిమా వివరాలు

సినిమా వివరాలు

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘1' సినిమాలో క్రితి సానన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X