'1 నేనొక్కడినే' ట్రిమ్: సక్సెస్ మీట్‌లో సుకుమార్
హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సక్సెస్ మీట్ శనివారం హైదరాబాదులో జరిగింది. నిర్మాతలు రామ్, గోపి ఆచంట, అనిల్ సుంకర ఈ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. చిత్ర దర్సకుడు సుకుమార్ కూడా సక్సెస్ మీట్‌లో పాలు పంచుకున్నారు.
తమకు చాలా ఆనందంగా ఉందని, సినిమాకు మంచి స్పందన లభించిందని, ఫ్యాన్స్ రిపోర్టు తమకు సంతోషాన్నిచ్చిందని దర్శకుడు సుకుమార్ అన్నారు. 15 నిమిషాల సినిమా ఫుటేజీలను ట్రిమ్ చేసినట్లు ఆయన తెలిపారు.

కంటెంట్ ప్యాకింగ్ కోసం ఆ పని చేసినట్లు దర్శకుడు చెప్పారు. ఇది మరింత ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే విధంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 1నేనొక్కడినే సినిమాకు మంచి టాక్ రావడంతో నిర్మాతలు ఆనందంగా ఉన్నారు.
మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా ఈ నెల 10వ తేదీన శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











