ఇంటర్ పుస్తకంలో... మహేష్ బాబు ప్రస్తావన
దూకుడు, బిజినెస్ మేన్ సినిమాలు వరుసగా భారీ విజయాలు సాధించిన ఎఫెక్టో.. ఏమోగానీ హీరో మహేష్ బాబు పేరు మార్మోగి పోతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహేష్ బాబే టాలీవుడ్ టాప్ అనడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు అభిమానులు. టాలీవుడ్ చరిత్రలోనే మహేష్ బాబు తొలి సారిగా కార్పొరేట్ బ్రాండ్‌కు నేషనల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక సినిమా మార్కెట్ ఉన్న హీరో కూడా అతడే. దీనికి తోడు తాజాగా ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ పుస్తకంలో మహేష్ బాబుపై ప్రస్తావన రావడం తమ హీరో స్టార్ రేంజ్‌కి నిదర్శనం అంటున్నారు.
వివరాల్లోకి వెళితే...
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పుస్తకంలోని 189వ పేజీలో 9వ ప్రశ్న మహేష్ బాబును పేరు ప్రస్తావిస్తూ వచ్చింది. ''Mahesh Babu is one of most popular actors. (change to comparative degree)'' అంటూ ఈ ప్రశ్న ఉంది.
గతంలో పాఠ్య పుస్తకాల్లో సినీ తారల పేర్లు రాకుండా పుస్తకాలను తయారు చేసే ప్రొఫెసర్లు జాగ్రత్త వహించే వారు. దానికి కారణం గతంలో ఇలాంటి విషయాలపై వివాదాలు ఏర్పడటమే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పేరు పాఠ్య పుస్తకంలో రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











