»   »  200 కోట్లు టార్గెట్: మహేష్ బాబు భారీ మల్టీ స్టారర్

200 కోట్లు టార్గెట్: మహేష్ బాబు భారీ మల్టీ స్టారర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు'(వర్కింగ్ టైటిల్) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీ లాంగ్వేజ్ మల్టీస్టారర్ మూవీ అని అంటున్నారు. మహేష్ బాబుతో పాటు కోలీవుడ్ స్టార్ ఆర్య, మాళయాల నటుడు మోహన్ లాల్ కాబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు.

టోటల్ సౌతిండియా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ...ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. మగ్గురు మూడు సౌతిండియాన్ స్టేట్లలో పెద్ద స్టార్లు కావడంతో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం వసూళ్లు ర. 200 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలతో ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నారు. తమిళంలో మహష్ బాబు మార్కెట్ రూ. 50 కోట్ల పైనే, ఆర్య, మహేష్ బాబు, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం వసూళ్లు రూ. 200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

 Mahesh Babu in 200 cr multi-starrer film!

ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ‘శ్రీమంతుడు' సినిమా విశేషాల్లోకి వెళితే...
మహేష్‌ బాబు హీరోగా మై త్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రుతి హాసన్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌, శ్రుతిలతో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

షూటింగ్‌ తుది దశకు చేరుకొంటోంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. సినిమాలో మహేష్‌ ధనవంతుడిగా కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా స్త్టెలిష్‌గా ఉంటుందని చెబుతున్నారు. అయితే టైటిల్‌పై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Prince Mahesh is on row with series of flicks. After “Srimanthudu”, Mahesh is set to move to a multi-starrer film. As per the information, Mahesh is planning to work in a film which has Kollywood’s top hero Arya and Mollywood’s big shot actor Mohan Lal in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu