మహేష్ బాబు...న్యూఇయర్ క్యాలెండర్
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ చిత్రాలు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో రేసులో టాప్ పొజిషన్లో ఉండటంతో....అనేక కార్పొరేట్ సంస్థలు ఆయనకున్న పాపులారిటీని ఉపయోగించి తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రచాకల్పించుకోవడానికి ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్న సంగతి తెలిసిందే.
అలాంటి సంస్థలో ప్రముఖ మొబైల్ అమ్మకాల సంస్థ 'యూనివర్సల్' ఒకటి. కొత్త సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో యూనివర్సల్ సంస్థ మహేష్ బాబు ఫోటో కూడిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. మహేష్ బాబు దీంతో అనేక కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. సదరు సంస్థలు కూడా మహేష్ బాబు ఫోటోతో క్యాలెండర్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం మహేష్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సంక్రాంతి పండగను పురస్కరించుకుని గ్రాండ్ గా విడుదలవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వెంకటేష్ కూడా నటిస్తున్నారు. సమంత, అంజలి హీరోయిన్లు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈచిత్రం వేసవిలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో క్రితి సానన్ అనే కొత్త హీరోయిన్ సినిమాలకు పరిచయం అవుతోంది.


Click it and Unblock the Notifications











