2015 మహేష్ బాబు క్యాలెండర్ ఆవిష్కరణ
చిలకలగూడ: సికింద్రాబాద్ గ్లామర్ కింగ్ కృష్ణ మహేష్ ఫాన్స్ అధ్యక్షుడు జె.పి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జలిగమ మహేష్ ఆద్వర్యంలో ముద్రించిన మహేష్ బాబు-సుధీర్ బాబు 2015 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ బుధవారం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేసి హీరో సుధీర్ బాబుకు తొలి కాపీ అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎ. రమేష్ స్వామి, బి. నాగరాజు స్వామి , కే. మహేష్ బాబు , కే. శేఖర్, జే. మహేష్, సలాది కృష్ణ (పత్తిపాడు) తదితర అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ....నూతన సంవత్సరంలో మహేష్ బాబు, సుధీర్ బాబు మరిన్ని వినోదాత్మక చిత్రాలు తీసి ప్రేక్షకులను అలరించాలని ఆకాక్షించారు. సేవా కార్యక్రమాల్లో కృష్ణ మహేష్ బాబు అభిమానులుగా తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు.

సినిమా గురించిన వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











