SAMB28: మహేష్ కోసం ఫైనల్ ప్లాన్ రెడీ చేసిన త్రివిక్రమ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా నెవర్ బిఫోర్ అనేలా బెస్ట్ కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక అందరికీ ఎక్కువగా ఆసక్తిని కలిగించే బిగ్గెస్ట్ కాంబినేషన్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పవచ్చు. వీరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు అనుకున్నంతగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించకపోయినప్పటికి కూడా వీరి కలయికలో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న త్రివిక్రమ్ ముందుగానే రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.

ఫైనల్ గా మహేష్ తో..

ఫైనల్ గా మహేష్ తో..

అజ్ఞాతవాసి సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ అరవింద సమేత సినిమాతో ఒక ట్రాక్లోకి వచ్చేశాడు. కానీ ఆ సినిమా రిజల్ట్ పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఇక ఫైనల్ గా అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అనంతరం మహేష్ బాబు తో సినిమా చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ కు మొత్తానికి ఈ ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 పూర్తి కథ సిద్ధం చేసిన తరువాతనే..

పూర్తి కథ సిద్ధం చేసిన తరువాతనే..

అసలైతే ఆరేళ్ళ క్రితమే మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఇద్దరు కూడా పవర్ఫుల్ కథపై చాలా నమ్మకంతో కూడా ప్రాజెక్టును మొదలు పెట్టాలని చూశారు. కానీ ఎందుకో అనుకున్న సమయానికి ఆ కథ అయితే పట్టాలెక్కలేదు. అనంతరం త్రివిక్రమ్ మళ్ళీ కొన్ని కథలు చెప్పినప్పటికీ మహేష్ సంతృప్తి చెందలేకపోయాడు. ఇక ఫైనల్ గా గత ఏడాది చెప్పిన ఒక పాయింట్ నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేసిన తర్వాతనే మహేష్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఫిబ్రవరిలో లాంచ్

ఫిబ్రవరిలో లాంచ్

గతంలో మహేష్ బాబు దర్శకుడు నచ్చితేనే కథపై పెద్దగా ఆలోచించకుండా సినిమా చేసేందుకు ఒప్పుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆయన అనుకున్న దానికంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు. ముందు పూర్తి స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేసేందుకు ఒప్పుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ కూడా మహేష్ కోసం బౌండ్ స్క్రిప్ట్ ను సిద్దం చేసి ప్రాజెక్టు ను ఫిబ్రవరిలో లాంచ్ చేశాడు.

షూటింగ్ ప్లాన్ రెడీ

షూటింగ్ ప్లాన్ రెడీ

ముందుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో కూడా ఒక క్లారిటీ కి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మూడవ వారం నుంచి ఈ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలైన తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండా ఇదే ఏడాది ఏడాది నవంబర్లో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

Recommended Video

Keerthy Suresh Interview కీర్తి తో జయమ్మ పంచాయతీ | Good Luck Sakhi | Filmibeat Telugu
రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ డేట్ ఫిక్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదైనా సినిమాను పక్కా ప్రణాళికతో మొదలుపెట్టాడు అంటే వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. అదే తరహాలో మహేష్ బాబు 28 వ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాను 2023 జనవరి 6వ తేదీన విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X