మహేష్ ‘త్రీ ఇడియట్స్’తో హరీష్ జయరాజ్ ట్యూన్స్...
బ్రహ్మానడబైన రోబో సక్సెస్ తర్వాత డైరెక్టర్ శంకర్ నెక్ట్స్ ప్రొజెక్ట్ ప్రారంబించేశాడు. మహేష్ హీరోగా తెలుగులో రానున్న 'త్రీ ఇడియట్స్" డిసెంబర్ 3న లాంఛనంగా ప్రారంభంకానుంది. హిందీలో అమీర్ ఖాన్ వేసిన పాత్రను మహేష్ బాబు చేయనున్నారు. మిగిలిన రెండు పాత్రల్లో నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు జీవా, తమిళ నటుడు ఆర్య కనిపించనున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక పాటకు రికార్డింగ్ కూడా పూర్తిచేసినట్టు హరీష్ జయరాజ్ వివరించారు. ఇంతకు మనుపే హరీష్ జయరాజ్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ మూవీ 'అన్నీయన్" చిత్రానికి వర్క్ చేశారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న 'దూకుడు" చిత్రంలో నటిస్తున్నాడు.
మహేష్ బాబు శంకర్ హరిష్ జయరాజ్ త్రీ ఇడియట్స్ రోబో ఆర్య జీవా mahesh babu shankar harish jayaraj 3idiots robo arya jeeva


Click it and Unblock the Notifications