'ఆగడు' టీజర్ ని వెటకారం చేస్తూ... (ఫొటోలు)
హైదరాబాద్ : మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మరో ప్రక్క ఈ టీజర్ పై ఫేస్ బుక్,ట్విట్టర్ లో ఓ రేంజిలో పంచ్ లు పడుతున్నాయి. ఈ చిత్రంలో పంచ్ డైలాగుకు మండిపడుతున్న మిగతా హీరోల ఫ్యాన్స్...ఈ టీజర్ గబ్బర్ సింగ్ లా ఉందని తేల్చారు. అంతేకాదు... ఈ టీజర్ ని వెటకారం చేస్తూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. ఆ ఫొటోలలో కొన్నిటిని మీ కోసం అందిస్తున్నాం.
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది.
పంచ్ డైలాగు లేకపోతే.. టీజర్, ట్రైలర్ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
గమనిక: ఇవి ఏ హీరోని చిన్నతనం చేయటానికి ఉద్దేశించినవి కాదు...వన్ ఇండియా తయారుచేసిన ఇమేజెస్ అసలు కాదు అని గమనించమనివి...కేవలం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రచారమవుతున్నవి సేకరించినవి మాత్రమే.
స్లైడ్ షోలో ఆ ఫోటోలు.....

పవన్ ని ఉద్దేశించి..
ఆగడు టీజర్ లో చెప్పిన డైలాగు పంచ్ ... పవన్ ని ఉద్దేశించే అని కొందరు పవర్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు

యాజటీజ్
గబ్బర్ సింగ్ ని పూర్తిగా గుర్తు వచ్చేలా కాపీ కొట్టిన టీజర్ ఇది అని చెప్తున్నారు. సినిమాలో విషయం ఏమున్నా మొదట ఈ ప్రచారం మాత్రం కొంచెం ఇబ్బంది కరమే.

బెల్ట్ మీద
గబ్బర్ సింగ్ బెల్ట్ మీద...ఆ అక్షరాలు ఉండటం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆగడు అని ఉంది చూపి, గబ్బర్ సింగ్ ని గుర్తు చేస్తున్నారు.

స్టైల్...
మహేష్ బాబు స్టైల్, ట్రైలర్లోని కొన్ని సీన్లు అచ్చు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను చూసిన అనుభూతిని కలిగిస్తోందని అంటున్నారు.

కావాలనే...
ఇది కావాలని పవన్ కళ్యాణ్‌పై సెటైరిక్‌గా ప్లాన్ చేసారని, ట్రైలర్ రిలీజ్ హాట్ టాపిక్ కావాలని, ఈ విషయం మీడియాలో చర్చీనీయాంశం కావాలనే ఇలా చేసినట్లు సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అయితే మహేష్ లాంటి స్టార్ హీరోకు అంత అవసరం లేదన్నది నిజం.

టీజర్ విడుదల
మహేష్ తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినమైన ఈ నెల 31న 'ఆగడు' సినిమా ప్రచార చిత్రం విడుదల చేయటంతో అంతా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు

ఆడియో విడుదల
మహేష్ జన్మదినమైన ఆగస్టు 9న పాటలను విడుదల చేసేందుకుప్రయత్నాలు చేస్తున్నారు.

దినేష్ మాస్టర్ తో..
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లడఖ్‌లో జరుగుతోంది. హీరో,హీరోయిన్స్ పై పాటను చిత్రీకరిస్తున్నారు. దినేష్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు.

షెడ్యూలు..
ఈ నెల 30 వరకు లడఖ్‌లో చిత్రీకరణ ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుతాం

కొన్ని టెన్షన్ లు..
మెదట కోన వెంకట్, గోపీ మోహన్ ఈ ప్రాజెక్టు లో లేకపోవటం, తర్వాత ప్రకాష్ రాజ్ సైతం ప్రాజెక్టు కు బై చెప్పటం మహేష్ బాబుని ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు.

ఎక్కువ శ్రద్ద
ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన 1 , నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ కావటం కూడా ఆయన్ను ఈ ప్రాజెక్టుపై ఎక్కువ కాన్సర్టేట్ చేసేలా చేస్తోంది

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా
'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. పోలీస్ డ్రస్ ఆయనకు కలిసిరావటం తెలిసిన విషయమే

విడుదల తేదీ
దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాపీ రూమర్స్
ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బాలీవుడ్ సూపర్ హిట్ ‘స్పెషల్ చభ్బీస్ 'చిత్రం నుంచి లిఫ్ట్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచిన రెండు ఎపిసోడ్స్ కొద్దిపాటి మార్పులతో ఈ చిత్రంలో ఉంటాయని చెప్పుకుంటున్నారు.

ప్రేరణతో ...
‘ఆగడు'లో మహేష్ పాత్ర నానా పటేకర్...అబ్ తక్ చప్పన్ చిత్రంలో చేసిన ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ప్రేరణతో ఉంటుందని సమాచారం.

అనంతపూర్ బ్యాక్ డ్రాప్
ఈ పాత్ర పేరు...ఎనకౌంటర్ శంకర్ అని, అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, చాలా పరవ్ ఫుల్ గా ఈ పాత్రను డిజైన్ చేసారని, అయితే ఆ కథ సీరియస్ గా జరిగితే ఈ సారి..ఫన్ తో నడుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లోచెప్పుకుంటున్నారు.

స్లాంగ్ మారింది
‘దూకుడు'లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. ‘ఆగడు'లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి.

నాగార్జునని...
ఓ ప్రక్క తమ హీరోని కాపీ కొట్టారని పవన్ ఫ్యాన్స్ అంటూంటే...మరో ప్రక్క అదేం కాదు..అసలు నాగార్జున ...శివమణి చిత్రంలో స్టిల్ నే గబ్బర్ సింగ్ చిత్రంలో వాడారు అంటున్నారు.

మిస్టర్ బీన్...
అంతేకాకుండా జల్సా లో పాపులర్ అయిన స్టిల్ ...కూడా కాపీ అది మిస్టర్ బీన్ నుంచి ఎత్తివేసారని ఇలా పోస్ట్ లు పెడుతున్నారు.

'ఆగడు' టీజర్ ని వెటకారం చేస్తూ... (ఫొటోలు)
డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











