మహేష్ బాబు చేతికున్న వాచీ హాట్ టాపిక్ అయింది

దూకుడు సినిమా విశేషాల్లోకి వెళితే...
మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని 'ఆగడు' సినిమా సెకండ్ టీజర్ ఆగస్టు 9న విడుదలైంది. అదిరిపోయే విధంగా సెకండ్ టీజర్ ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ టీజర్ చూస్తుంటే 'ఆగడు' చిత్రం పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టెనర్ అని స్పష్టం అవుతోంది. ఇక మహేష్ బాబు ప్రతి డైలాగులోనూ పంచ్ లు వేస్తూ అభిమానులను అలరించనున్నారు. 'నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ ను కాదు ఫైటర్ ను' అంటూ మహేష్ బాబు చెప్పిన పంచ్ డైలాగ్ సెకండ్ టీజర్ కు హైలెట్ అయింది. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ చూసి పుల్ హ్యాపీగా ఉన్నారు.
వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.
ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. త్వరలో సినిమా ఆడియోను విడుదల చేసిన సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు, విలన్ సోను సూద్ ఫైట్ సీన్లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.
క్లైమాక్స్ సీన్లు షూటింగ్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూరఫ్ వెళ్లనున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగనుంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ పాటలు రెడీ చేసాడు. పాటల కంపోజింగ్ పూర్తయిన విషయాన్ని థమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











