»   » ‘బాహుబలి’ గర్వకారణం: అందుకే తప్పుకున్నాం: మహేష్ బాబు

‘బాహుబలి’ గర్వకారణం: అందుకే తప్పుకున్నాం: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును రెయిన్ బో హాస్పటల్ గుడ్ విల్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఈ ఆసుపత్రికి సంబంధించిన ఓ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బాహుబలి సినిమాపై తన అభిప్రాయం, శ్రీమంతుడు వాయిదా అంశాలపై స్పందించారు.

బాహుబలి గురించి మాట్లాడుతూ...‘తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ గర్వపడే సినిమా బాహుబలి. ఇండియన్ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్, భారీ ఎఫర్ట్ పెట్టిన సినిమా' అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. బాహుబలి, శ్రీమంతుడు సినిమా విడుదలకు మధ్య మూడు నాలుగు వారాల గ్యాప్ ఉండటమే మంచిదని వ్యాఖ్యానించారు.

‘ఇది పోటీ పడాల్సిన సమయం కాదు. హెల్దీ కాంపిటీషన్ ఉంటేనే అందరికీ మంచింది. అందుకే బాహుబలి సినిమా విడుదల ఉంది కాబట్టి శ్రీమంతుడు సినిమాను వాయిదా వేసాం' అని మహేష్ బాబు తన మనసులోని మాటను చెప్పారు.

బాహుబలి, శ్రీమంతుడు రెండు సినిమాలు భారీ విజయం సాధించాలని మహేష్ బాబు ఆకాంక్షించారు. బాహుబలి టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంత కాలం ‘శ్రీమంతుడు' సినిమా వాయిదాపై అసంతృప్తిగా ఉన్నఅభిమానులు మహేష్ బాబు వివరణతో అయినా శాంతిస్తారో లేదో!

స్లైడ్ షోలో రెయిన్ బో ఆసుపత్రి కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు...

మహేష్ బాబు

మహేష్ బాబు

రెయిన్ బో ఆసుపత్రికి సంబంధించిన కార్యక్రమంలో మహేష్ బాబు.

మీడియాతో..

మీడియాతో..

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న మహేష్ బాబు.

దర్శకేంద్రుడితో

దర్శకేంద్రుడితో

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి మహేష్ బాబు.

పిల్లలు...

పిల్లలు...

మహేష్ బాబును స్టేజీపైకి ఆహ్వానిస్తున్న పిల్లలు.

సందడి...

సందడి...

పిల్లలతో కలిసి మహేష్ బాబు స్టేజీపై ఇలా సందడి చేసారు.

English summary
Mahesh Babu has agreed to be the good will ambassador for Rainbow Hospitals and the actor was at an event conducted by them. Talking at the event, Mahesh Babu opened up on Baahubali and Srimanthudu release postponement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu