అంతా టైమ్ అంతే!: మహేష్ బాబు
ఒక టైమ్ లో మూడేళ్లు సినిమానే లేదు..ఇప్పుడు వరసగా ఎవరు చెప్పినా కథలు నచ్చేస్తున్నాయి..బావుంటున్నాయి. అంతా టైమే...నేను వెరీ లక్కీ అన్నారు అన్నారు మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ ప్రమేషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. అలాగే ఆయన్ని బిజినెస్ మ్యాన్ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ గురించి ...నాకు అస్సలు హిందీలో చేయాలని లేదు...బేసిక్ గా నా దృష్టి తెలుగు సినిమాలమీదే ఉంది. ఇంకా ఇక్కడే ఎంతో చెయ్యాలని ఉంది. రెండు మూడేళ్లు వరకూ ఇక్కడే తెలుగు సినిమాలే చేద్దామనుకుంటున్నాను.
ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల మీదే కాన్సర్టేట్ చేస్తున్నాను అన్నారు. ఇక ధియోటర్లో తన ఫ్యాన్స్ మధ్యన కూర్చుని బిజినెస్ మ్యాన్ చిత్రం చూడటం గురించి మాట్లాడుతూ...ధియోటర్ లో చిత్రం చూడాలని ఉంది..వెళ్లాలని ఉంది కానీ..సుదర్శన్ ధర్టీ ఫైవ్ ఎంఎమ్ వారు తర్వాత వద్దువుగానిలే అన్నారు. ఓ రోజు వెళ్లి మార్నింగ్ షో చూసి వస్తా అన్నారు. ఇక తనపై ఇంత అభిమానం చూపెడుతున్న అభిమానులుకు ఆయన ధాంక్స్ చెప్పుకున్నారు. ప్రస్తుతం తన చేతిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సుకుమార్ చిత్రాలు కమిటై ఉన్నాయన్నారు.


Click it and Unblock the Notifications











