కమల్‌హాసన్ నటించిన దశావతారం సినిమాకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రశంసించాడు. ఈ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పాడు. పది పాత్రలను ఒకే సినిమాలో చేయడం ఇండియాలో కమల్ ఒక్కరికే సాధ్యపడుతుందన్నాడు. ఒక్కో పాత్ర విషయంలో కమల్ చాలా జాగ్రత్త తీసుకున్నారు. మేకప్, బాడీ లాంగ్వేజ్ విషయాల్లో కమల్ తీసుకున్న జాగ్రత్తలు ఆశ్చర్యపరిచాయని ప్రిన్స్ మహేష్ చెప్పాడు. ఐదుగురు కమల్‌హాసన్‌లు ఒకేసారి కనపడటం, అన్ని పాత్రలను అద్భుతంగా చెయ్యడం చూసి థ్రిల్ అయ్యాను.అత్యున్నత విలువలపై దశావతారం చిత్రాన్ని రూపొందించిన దర్శక,నిర్మాతలు కేఎస్ రవికుమార్, ఆస్కార్ రవిచంద్రన్ ఎంతైనా అభినందనీయులు అని మహేష్ తెలిపాడు. ఇంతకుముందు ఏ చిత్రం గురించి మాట్లాడని మహేష్ దశావతారంపై స్పందించడం విశేషం.
Story first published: Friday, July 17, 2026, 1:02 [IST]