ఇది నమ్మలేకపోతోన్నా.. ‘తుఫాన్’పై మహేష్ బాబు ప్రశంసలు
ఫర్హాన్ అక్తర్ హీరోగా ప్రేక్షకులను పలకరించి చాలా ఏళ్లు అవుతున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో భాగ్ మిల్కా భాగ్ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అథ్లెట్ పాత్రలో ఫర్హాన్ నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే మళ్లీ ఆ స్థాయి సినిమా ఫర్హాన్ ఖాతాలో పడలేదు. అయితే మళ్లీ ఇన్నేళ్లకు మరో స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు రాబోతోన్నాడు. బాక్సర్‌గా తన విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు.
అదిరిపోయిన టీజర్
తాజాగా ఫర్హాన్ నటించిన తుఫాన్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో ఫర్హాన్ బాక్సర్‌గా అదరగొట్టేశాడు. పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మార్చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో రౌడీగా, బాక్సర్‌గా రెండు పాత్రల్లో అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది. రౌడీగా ఉండాలనుకుంటున్నావా? బాక్సర్‌గా ఉండాలనుకుంటున్నావా? అంటూ హీరోయిన్ అడిగే సీన్ బాగానే ఉంది.

తుఫాన్ అంటూ..
ఇక ఈ జెమ్‌ను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావ్ అని అందరూ అంటుంటే.. అతను జెమ్ కాదు తుఫాన్ అంటూ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రింగులోకి దిగే ముందు తుఫాన్ అని జనాలు నినాదాలు చేస్తోన్న సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలానే ఉన్నాయి. మొత్తానికి ఈ టీజర్ సెలెబ్రిటీలను సైతం ఆకట్టుకుంది.

మహేష్ బాబు రియాక్షన్..
తుఫాన్ టీజర్ వీక్షించిన మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తుఫాన్ టీజర్ టెర్రిఫిక్‌గా ఉంది.. మరోసారి ఫర్హాన్ ఈ పాత్రలో అదరగొట్టేశాడు.. ఈ మార్పు చూస్తుంటే నమ్మశక్యంగా లేదు.. ఈ మూవీ చూడాలని ఎంతో ఆత్రుతగా ఉందంటూ ప్రశంసలు కురిపించాడు.

మే 21న ప్రైమ్‌లో..
థ్యాంక్యూ మహేష్.. నీకు సినిమా చూపించాలని ఎంతో ఆత్రుతగా నేను కూడా ఎదురుచూస్తున్నాను అంటూ ఫర్హాన్ అక్తర్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కూడా తుఫాన్ టీజర్ మీద ట్వీట్లు వేస్తున్నారు. మే 21న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications











