మహేష్ బాబుకు కూడా ఆ పిచ్చి ఉంది!

By Bojja Kumar

హైదరాబాద్: ప్రపంచం మొత్తాన్ని ఇపుడు సాకర్ ఫీవర్ చుట్టేసింది. ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టపడే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. అందులో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. తాజాగా బ్రెజిల్ వేదికగా ఫిపా వరల్డ్ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

తనకు ఫుట్ బాల్ మ్యాచ్‌లు చూడటం అంటే ఎంతో ఇష్టమని, స్పెయిన్ తన ఫేవరెట్ జట్టు అని, క్రిస్టియానో రొనాల్డో తన ఫేవరెట్ ఆటగాడు అని మహేష్ బాబు చెబుతున్నాడు. బ్రెజిల్, స్పెయిన్ జట్లు ఫైనల్‌లో తలపడాలని....స్పెయిన్ జట్టు వరల్డ్ కప్ గెలవాలని మహేష్ బాబు కోరుకుంటున్నాడు.

Mahesh Babu about FIFA soccer world cup

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...ఆయన ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు మహేష్. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ముంబై తర్వాత కేరళ షెడ్యూలు వెళ్లనున్నారు. ముంబై షెడ్యూలు 15 రోజులు పాటు జరగనుంది. కేరళలలో కొన్ని కీలకమైన లవ్ సీన్స్ తీయనున్నారని సమాచారం. అక్కడ అందమైన లొకేషన్స్ లో ఈ సీన్స్ ప్లాన్ చేసారని సమాచారం.

ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. సోనూ సూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X