గుణశేఖర్ గ్రేట్ డైరెక్టర్...మహేష్ బాబు
గుణశేఖర్ గ్రేట్ డైరెక్టర్ అని, తన కెరీర్ లో 'ల్యాండ్ మార్క్'గా నిలిచిన చిత్రాలను ఆయన ఇచ్చారని, అది ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. "ఒక్కడు' విడుదలై సరిగ్గా ఏడేళ్లు అవుతోంది. గుణశేఖర్ అద్భుతమైన సినిమా ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు' అని మహేష్ బాబు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే అలాగే ఒక్కడు, అతడు, పోకిరి, మురారి తన అభిమాన చిత్రాలని కూడా మహేష్‌బాబు పేర్కొన్నారు. అంతేగాక ఈ రెండేళ్ళుగా తన సినిమా కోసం నిరీక్షిస్తూ.. తనని అభిమానిస్తున్నవారికి కూడా 'మిలియన్ థ్యాంక్స్' అని, ఈ రెండేళ్లుగా తన లైఫ్ సంతృప్తికరంగా ఉందని, నటుడిగా తానింకా ఎదిగానని, వ్యక్తిగా కూడా పరిణతి చెందానని మహేష్ బాబు చెప్పారు. ఇక బాలీవుడ్ నటుడు రణబీర్..మహేష్ ఒక్కడు చిత్రం చూసి..."మహేష్ బాబు నటన అద్భుతం...సినిమా చాలా బాగుంది. హిందీ సినిమాకు ఆయన మంచి భవిష్యత్ అవుతారు' అని రణబీర్ పేర్కొన్నారు. ముంబయ్ లో రణబీర్ కపూర్ కోసం 'ఒక్కడు' సినిమాకి సంబంధించి ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. ఆ సినిమా చూసిన తర్వాత ఈ విధంగా ట్విట్టర్ లో స్పందిచారు. ఈ అభినందనలకు మహేష్ బాబు తన ట్విట్టర్ లో స్పందిస్తూ..రణబీర్ కి ధాంక్స్ చెప్పుకున్నారు. ఇక గుణశేఖర్ తాజాగా అల్లు అర్జున్ తో వరుడు చిత్రం అందించారు. అలాగే ఒక్కడు అనంతరం మహేష్ తో అర్జున్, సైనికుడు చిత్రాలు రూపొందించారు.


Click it and Unblock the Notifications











