ఒత్తిడికి లోనై తప్పులు చేసా: మహేష్ బాబు
మొదట్లో నా సినిమాలు వరసగా రెండు మూడు ఆశించిన స్దాయిలో నిలవలేక పోయాయి. ఆ దశలో బాగా ఒత్తిడికి లోనయ్యాను. అయితే సినిమాలకు సంభందించి మొదటి నుంచీ నేనే నిర్ణయం తీసుకుంటున్నాను. స్క్రిప్టును వినే విషయంలో కూడా నాన్నగారి సాయిం అడగలేదు. ఈ క్రమంలో తప్పులు చేసాను. కానీ పాఠాలు నేర్చుకున్నాను అంటూ తన మనస్సులో మాటను చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఆయన పాపులర్ పత్రిక ఇండియాటుడేతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే తను చేసిన సినిమాల్లో నాకు నచ్చిన చిత్రాలు ఏవి అంటే... ఒక్కడు నాకు బాగా నచ్చిన చిత్రం. నా క్లాసిక్ అది. ఆ తర్వార మురారి. కుటుంబ చిత్రంగా మురారి బాగా పేరు తెచ్చింది. ఇక నన్ను పోకిరి స్టార్ ని చేసింది. ఇప్పుడు దూకుడు రికార్డులను సృష్టిస్తోంది. నాకు ఇష్టమైన మరో సినిమా అతడు. ఇక నేను ఇంగ్లీష్ సినిమాలను చూస్తూంటాను. అదే సమయంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సినిమాలనూ చూస్తుంటాను. మగధీర చూసాను. ప్రేక్షకులను మెప్పించిన సినిమాలను చూడకపోతే ఎలా. ఆ విధంగా చూస్తూండటం మంచింది అన్నారు.
ఇక దూకుడు విషయానికి వస్తే ఆ చిత్రం నూరు శాతం కంటే ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది. దాని పైన పది నెలలు పనిచేసారు. అంతా సానుకూలంగా తోచింది. నాన్నగారంటే ఇష్టపడే శీనుగారు మనం చేస్తున్నది ఓ బ్లాక్ బస్టర్ అని ఫిక్సైపోండి అన్నారు. సినిమా షూటింగ్ ఇస్తాంబుల్ లో ప్రారంభమైనప్పుడు నాకు అదో షూటింగ్ లాగ కాకుండా విజయోత్సవంలా తోచింది. అలాగే దూకుడుది ఓ సమగ్రమైన స్క్రిప్టు. దానిలో అన్ని రకాల ఎమోషన్స్ తండ్రి కొడుకుల అనుభందం, ప్రేమ, పోరాటం, వినోదం ఉన్నాయి. ఒక సినిమాలో ఇన్ని ఎమోషన్స్ ఈ స్ధాయిలో ఉండవు. నా మటుకు నాకు ఇంతటి కంప్లీట్ స్క్రిప్టు గల సినిమాలో పనిచేయటం ఇదే మొదలు అన్నారు.


Click it and Unblock the Notifications











