నేను పొరపాటు చేశాను: మహేష్ బాబు
పోకిరి' హిట్టు తర్వాత దాన్నే పట్టుకు వేలాడేందుకు ప్రయత్నించి, నా నెక్స్ట్ చిత్రాల్లో అది కొనసాగించాను. అక్కడే నేను పొరపాటు చేశాను. అలాగే 'సైనికుడు', 'అతిథి' సినిమాల తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఎనిమిదినెలలనుకున్నది రెండేళ్ళయింది. ఆ సమయంలో నేను నిజంగా గందరగోళంలో వున్నాను, నా నటన ఏ మార్పూలేనిదిగా తయారైందనిపించింది. వ్యక్తిగతంగా కూడా నేను అంత బాగా చేయలేదు. నాకు సన్నిహితులైనవారు కొందరు దూరమయ్యారు అంటూ గతన్ని గుర్తు చేసుకున్నారు మహేష్.
బిజినెస్ మ్యాన్ విజియోత్సాహంలో ఉన్న ఆయన మీడియా వద్ద తన పొరపాట్లుని, విజయాలను సమీక్షించుకుంటూ మాట్లాడారు. అలాగే...తిరిగి పరిశ్రమకు వచ్చిన తర్వాత, నేను ప్రయోగం చేస్తున్నానని తెలుసు, ఆ క్రమంలోనే 'ఖలేజా' రూపొందింది. ఆ ఎక్సపీరియన్స్ నాకు చాలా నేర్పింది అన్నారు. అలాగే... ఒక దశలో నేను విమర్శలను చాలా సీరియస్ గా తీసుకునేవాడ్ని. కోపం తెచ్చుకునేవాడిని. అయితే ఇప్పుడు, నేను ఎంతో మారాను, వాటిని ఆమోదించడం నేర్చుకున్నాను, వాటిని నేనే సరి చూసుకుంటున్నాను. విమర్శకుడు చెప్పింది సరైనదైతే నేను వింటాను అన్నారు.


Click it and Unblock the Notifications











