»   » ఏ సినిమా ఇంతలా ఇష్టపడి చేయలేదు: మహేష్ బాబు

ఏ సినిమా ఇంతలా ఇష్టపడి చేయలేదు: మహేష్ బాబు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కచ్చితంగా నా అభిమానులకు,వెంకటేష్ గారి అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా చూసి థియోటర్ నుంచి బయిటకు వచ్చే మొహాల్లో సంతోషం కనపడుతుంది. మంచి సినిమా చూసామన్న తృప్తిని ఈ సినిమా ఇస్తుంది..నా కెరీర్లో ఏ సినిమా ఇంతలా ఇష్టపడి చేయలేదు " అంటున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు తన తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' గురించి ఓ లీడింగ్ నేషనల్ డైలీతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.


  వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 11,2013 సంక్రాంతి కానుకగా ఈ కుటుంబ కధా చిత్రం విడుదల అవుతోంది. మిక్కీ జే మేయర్ అందించే సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు. డిసెంబర్ 15 న చిత్రం ఆడియో విడుదల అవుతోంది.

  దిల్ రాజు మాట్లాడుతూ...''నిర్మాతగా నా కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమా ఇది. వెంకటేష్, మహేష్ లాంటి టాప్ స్టార్స్‌తో మల్టీస్టారర్ మూవీ చేయడం గొప్ప అనుభూతి. భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒకరు.. అనే భావనే వసుధైక కుటుంబంలోని గొప్పదనం. ఆ విషయాన్ని ఓ అందమైన కథగా చెబుతున్నాము''అన్నారు.


  దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ...అన్నదమ్ముల అనుబంధానికి అర్థాలెప్పుడో మారిపోయాయి. అమ్మ ప్రేమ నుంచి... నాన్న సంపాదించిన ఆస్తుల వరకూ వాటాలేసుకొనేవాళ్లే అన్నదమ్ములిప్పుడు. షిప్టుల ప్రకారం అమ్మానాన్నల బాధ్యతల్ని పంచుకొంటున్నారు. ఇందుకు భిన్నమైన... ఆప్యాయతానురాగాలే ఆస్తిపాస్తులనుకొనే సోదరుల కథను తెర మీదకు తీసుకొస్తున్నా అని చెప్పారు.

  సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

  English summary
  
 Recently, in an interview to a leading national daily, Mahesh Babu said, “Seethamma Vaakitlo Sirimalle Chettu is going to be a new experience for my and Venkatesh garu’s fans. People will come out of the theatres with a big smile on their face and it’s a feel good film.” When asked if the film’s only USP is its ‘freshness’, Mahesh Babu retorted saying that it’s the first time he has done anything like this in his career and also stated that he fell in love with the script right when he heard it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more