24 ఏళ్లుగా అతడితోనే..... మహేష్ బాబు ఆసక్తికర పోస్ట్!

By Bojja Kumar

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ ఒకటి హాట్ టాపిక్ అయింది. ఈ పోస్టులో మహేష్ బాబు తనతో 24 ఏళ్లుగా అసోసియేషన్‌గా ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. అతడు ఎవరో కాదు... మహేష్ బాబు పర్సనల్ మేకప్‌మెన్ పట్టాభి.

 ఆయన లేకుండా కెమెరాను ఫేస్‌ చేయలేను

ఆయన లేకుండా కెమెరాను ఫేస్‌ చేయలేను

గత 24 ఏళ్లుగా ఆయన నాతోనే ఉన్నారు. ఆయన లేకుండా కెమెరాను ఫేస్‌ చేయలేను. ఈ ఫొటోను ఫొటోషాప్‌ చేయలేదు. నాకిష్టమైన కలర్‌ బ్లూలో మై మ్యాన్‌ పట్టాభి' అంటూ మహేష్ బాబు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.

 స్పెషల్ ఏమిటో?

స్పెషల్ ఏమిటో?

మహేష్ బాబును సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలో ఉంది. అయితే ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటేనే చాలా అరుదుగా మహేష్ బాబు స్పందిస్తుంటారు. అయితే ఉన్నట్టుండి ఆయన తన మేకప్‌మెన్ గురించి చెప్పడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.

 టాలెంటుతో పాటు నమ్మకం

టాలెంటుతో పాటు నమ్మకం

సినిమా రంగం అంటేనే టాలెంటుతో కూడుకున్న పరిశ్రమ. ఇక్కడ అది లేకుంటే ఎక్కువ కాలం నిలబడలేం. అదే సమయంలో ఒక వక్తితో లాంగ్ టైమ్ అసోసియేషన్ ఉండాలంటే నమ్మకం కూడా ఎంతో ముఖ్యం. ఈ రెండు పట్టాభిలో ఉన్నాయి కాబట్టే 24 ఏళ్లుగా మహేష్ బాబు అతడితో అసోసియేషన్ అయి ఉన్నారని చర్చించుకుంటున్నారు.

 ‘భరత్‌ అనే నేనే'

‘భరత్‌ అనే నేనే'

మహేష్ బాబు ప్రస్తుతం ‘భరత్‌ అనే నేను' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X