నా నిర్ణయం మారదు, వందేళ్లు వచ్చినా నేనింతే: మహేష్ బాబు
సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తమేమీ కాదు. ఆ నాటి ఎన్టీఆర్ నుండి ఈనాటి పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును మాత్రం అభిమానులు ఎప్పటికీ నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా చూసే అవకాశం లేదు. మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాలో సీఎంగా నటించిన తర్వాత ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మొదలైన నేపథ్యంలో దీనిపై మహేష్ క్లారిటీ ఇచ్చారు.
Recommended Video


నా నిర్ణయం మారదు, వందేళ్లు వచ్చినా నేనింతే
'భరత్ అనే నేను' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మహేష్ బాబు శుక్రవారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తనకు వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తానని స్పష్టంచేశారు. తాను రాజకీయాల్లోకి రాను' అని వెల్లడించారు.

చిన్నారులతో కలిసి సెల్ఫీలు
దుర్గ గుడి దర్శనం అనంతరం విజయవాడలోని డీవీ మానర్ హోటల్‌లో గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులను మహేష్ బాబు కలిశారు. వారితో కలిసి సెల్ఫీలకు పోజులిచ్చారు.

అభిమానులతో కలిసి సందడి
మహేష్ బాబు రాకతో బెజవాడలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో కలిసి అన్నపూర్ణ థియేటర్లో భరత్ అనే నేను సినిమా చూశారు. విజయవాడ రావడం సెంటిమెంట్‌గా భావిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఒక్కడు, పోకిరీ, దూకుడు వంటి విజయోత్సవ సభలు ఇక్కడ నిర్వహించిన విషయం గుర్తు చేశారు.

భారీ వసూళ్లతో దూసుకెళుతున్న భరత్
కాగా... భరత్ అనే నేను మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. తొలి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 200 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వంశీ పైడిపల్లి, సుకుమార్‌తో నెక్ట్స్
మహేష్ బాబు తన తర్వాతి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కాబోతోంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ మూవీ ఉండబోతోంది.


Click it and Unblock the Notifications











