ముంబైలో మహేష్ బాబు...విశేషాలు
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పాటల నిమిత్తం ముంబైలో ఉన్నారు మహేష్ బాబు. అహ్మద్ అనే కొరియోగ్రాఫర్ ఈ పాటలకు పనిచేస్తున్నారు. ఇక ఈ ట్రిప్ విశేషాలను తన అభిమానుల కోసం ట్వీట్ చేసారు మహేష్ బాబు. ఆయన మాటల్లోనే...నేను ముంబైలో ఉన్నాను. వాతావరణం చాలా లవ్ లీ గా ఉంది. రేపు పాటలు రిహార్సల్స్ ప్రారంభమవుతాయి. కొరియోగ్రాఫర్ అహ్మద్ ని కలిసాం..ఆయనతో ...త్రివిక్రమ్ నేను పాటల చిత్రీకరణపై లాంగ్ డిస్కషన్ చేసాం. లంచ్ త్రివక్రమ్ తోనూ, నా చిరకాలం తర్వాత కలిసిన మిత్రుడు జయంత్ తో కలిసి చేసాను.రేపు ట్రైల్స్, రిహార్సల్స్, మీటింగ్స్ తో హడావిడిగా ఉంటుంది.
ఇక ఈ చిత్రానికి సారధి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే మహేష్ బాబు క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క చేస్తోంది. శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సునీల్ పటేల్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.బుల్లిసుబ్బారావు, సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి.


Click it and Unblock the Notifications











