మహేష్ బాబు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం అతనేనట.. ఫొటో వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడి తరహాలోనే కనిపిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలలో బెస్ట్ హ్యాండ్సమ్ లుక్స్ ఎవరివి అంటే అందరూ కూడా మహేష్ బాబు పేరు చెప్పకుండా ఉండలేరు. ఇక ఫిట్నెస్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మహేష్ బాబు ఈ స్థాయిలో ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఒక ప్రత్యేకమైన డాక్టర్ అని తెలుస్తోంది.

ఇక ఆయన గురించి మహేష్ బాబు తొలిసారిగా తన సోషల్ మీడియాలో తెలియజేశారు. మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ సైలెంట్ గానే బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాడు.

Mahesh babu

అంతేకాకుండా డైట్ విషయంలో అతను ఎనాడు రూల్స్ బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతూ ఉంటాడు అని ఇండస్ట్రీలో అందరూ చెబుతూ ఉంటారు. ఇటీవల సూపర్ స్టార్ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు నేచురోపతి డాక్టర్ హ్యారీ కోనిగ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ కోయినిగ్ జర్మనీలో ఉన్న ఒక ప్రఖ్యాత వైద్యుడు. డాక్టర్ కోనిగ్‌కి అద్భుతమైన వైద్య సంరక్షణ అందించినందుకు మహేష్ బాబు కృతజ్ఞతలు తెలుపుతూ, "ధన్యవాదాలు డాక్టర్! ఆరోగ్యం మెరుగైన చేతుల్లో.. అంటూ మహేష్ వివరణ ఇచ్చారు.

మహేష్ బాబు అతని గురించి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు అంటే అతను ఎంతగా నమ్మే ఉంటాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ చాలా సంవత్సరాలుగా డాక్టర్ కోనిగ్ నుండి వైద్య చికిత్స పొందుతున్నారని అర్ధమవుతోంది. ఇక మహేష్ బాబు అభిమానులు రాబోయే చిత్రం SSMB28 విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా 2024 ఇజనవరి 13 థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజమౌళితో చేయబోయే SSMB29 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X