జూ ఎన్టీఆర్ 'బృందావనం' హిట్ అవ్వాలని కోరుకొంటున్న మహేష్..!?
'ఖలేజా" తో పోటీకి దిగుతోందని హంగామా చేసినా చివకరకు 'బృందావనం" వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. 'రోబో" టాక్ విన్న తర్వాత దిల్ రాజు టెక్కికల్ రీజన్స్ సాకుగా చూపించి తన సినిమాను వెనక్కి పంపాడు. అయితే 'రోబో" టాక్ ఏమిటో, ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియక ముందు నుంచీ కూడా అక్టోబర్ 7న ఖలేజా రిలీజవుతుంది" అంటూ అటు ఇంటర్వ్యూలు, థమ్స్ అప్ యాడ్ ద్వారా..మహేష్ భలే పబ్లిసిటీ ఇస్తున్నాడు.
'బృందావనం" అక్టోవబర్ 8కి విడుదల అన్నప్పుడు కూడా మహేష్ ఏ మాత్రం భయపడలేదు. అంటే మహేష్ ఖలేజాలో అంత ఖలేజా ఉందనే ప్రేక్షకులు నమ్మారు. బృందావనం పోటీ వుందంటే టెన్షన్ అనిపించలేదా అంటే..అస్సలు లేదని మహేష్ చెప్పాడు. 'ఖలేజా" మీద చాలా కాన్పిడెంన్స్ ఉందని, అంచేత ఏ సినిమాతో పోటీ ఉందన్నా టెన్షన్ పడలేదని అన్నాడు. అయితే బృందావనం కూడా మంచి హిట్టవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, ఇండస్ట్రీకి ఈ రెండు సినిమాలు హిట్టవ్వడం చాలా అవసరమని మహేష్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











