రాజమౌళి 'ఈగ'పై మహేష్ బాబు కామెంట్
రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'మొన్న శుక్రవారం భారీ ఎత్తున విడుదల అయ్యి మార్నింగ్ షో కే హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజమౌళి ని సిని పరిశ్రమ అభినందనలతో ముంచెత్తుతోంది. తాజాగా మహేష్ బాబు ఈగ చిత్రం చూసి సినిమా గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.
ఆ ట్వీట్ లో ...ఈగ తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన గ్రేట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలుస్తుంది.
రాజమౌళి గారికి, ఈగ టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్
ముఖ్యంగా సుదీప్ ఫెరఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్...
అని మూడు వాక్యాల్లో తన స్పందనను తెలియచేసారు మహేష్ బాబు.
ఇక ప్రస్తుతం మహేష్ ..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పూర్తిచేసే బిజీలో ఉన్నారు. వెంకటేష్ తో కలిసి చేస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరో ప్రక్క సుకుమార్ దర్సకత్వంలో మరో చిత్రం మొదలైంది. పాటతో ప్రారంభమైన ఈ చిత్రం ధ్రిల్లర్ అని తెలుస్తోంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్,వెంకటేష్, ప్రకాశ్ రాజ్, సమంత, అంజలిలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ఈ దసరాకి విడుదల కానుంది. మహేష్ బాబు అభిమాన కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications











