Sarkaru Vaari Paata సినిమాలో హీరో పేరు.. దర్శకుడు అలా అనగానే మహేష్ అనుమానాలు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు వెండితెరకు చాలా ఎక్కువగా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా సర్కారు వారి పాట థియేటర్లలోకి రావడానికి సిద్ధం కావడంతో ఈ సినిమా మొదటి రోజు మొదటి షో చూడడానికి ఆడియన్స్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు హీరో క్యారెక్టర్ పేరు పై మొదట్లో వర్కౌట్ అవుతుందా లేదా అనే అనుమానం కూడా వచ్చినట్లు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అంతకుమించి అనేలా..
విజయ్ దేవరకొండ తో గీత గోవిందం అనే సినిమా తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మొదటిసారి ఈ దర్శకుడు ఒక అగ్ర హీరోతో సినిమా చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా అంతకుమించి అనేలా ఉంటుంది అని చెప్పవచ్చు.

ఆ సినిమా చూసి..
ఇక ప్రతి ఇంటర్వ్యూలో కూడా పరుశురామ్ మహేష్ బాబు కు ప్రత్యేకమైన అభిమానిని అంటూ ఒక్కడు సినిమా చూసిన తర్వాతనే ఇండస్ట్రీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పాడు. మహేష్ బాబు ఒక్కడు సినిమా అంటే తనకు చాలా ఇష్టమైన సినిమా అని కూడా ఈ దర్శకుడు తెలియజేశాడు. ఇక రీసెంట్ గా దర్శకుడు తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా కు సంబంధించిన అనేక రకాల విషయాల గురించి మాట్లాడడం జరిగింది.

థియేటర్స్ దద్దరిల్లిపోవడం పక్కా..
ఈ సినిమా షూటింగ్ లో చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు మహేష్ బాబు తెలిపారు. ఇక కొన్ని సన్నివేశాల్లో అయితే అనుకోకుండా అప్పటికప్పుడే క్రియేట్ చేసిన కొన్ని సన్నివేశాలు చాలా బాగా సెట్ అయ్యాయని ఫస్ట్ హాఫ్ 40 నిమిషాల పాటు ఆడియన్స్ సినిమాను చూస్తూ చాలా బాగా నవ్వుకుంటారని కూడా తెలియజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్స్ దద్దరిల్లిపోవడం కాయమని అన్నారు.

హీరో క్యారెక్టర్ పేరు..
ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే కాకుండా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చుతుంది అని ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన విషయం గురించి కూడా మహేష్ బాబు తెలియజేశాడు. సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలాంటి పేరు పెడతారా అని అనుకున్నాను. కానీ ఊహించని విధంగా నా అసలు పేరు ఈ సినిమా లో పెట్టడం జరిగింది అని మహేష్ అన్నారు.

మహేష్ అబుమానం..?
ఇక కొన్ని సన్నివేశాల్లో.. నేను మహేష్ బాబు అని చెప్పగానే నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా కొత్తగా కూడా అనిపించింది. కానీ మొదట్లో మాత్రం ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని దర్శకుడిని అడిగినట్లుగా మహేష్ బాబు తెలియజేశాడు. కానీ సినిమాలో మహేష్ పేరుతో వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని మహేష్ నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమా ఈనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











