»   »  మహేష్ బాబు ఏమాత్రం బెదరడం లేదు...!

మహేష్ బాబు ఏమాత్రం బెదరడం లేదు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' మూవీ ఈ నెల 7న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఏమేర బిజినెస్ చేస్తుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఓ వైపు ‘బాహుబలి' సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీసు వద్ద తొలిసారిగా వంద కోట్లకలెక్షన్ దాటిన తెలుగు సినిమాగా రికార్డుల కెక్కింది. బాహుబలి తెలుగు వెర్షన్ కలెక్షన్లను ‘శ్రీమంతుడు' అధిగమిస్తుందా? లేదా? అనే ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది.


 Mahesh Babu about Srimanthudu collections

అయితే మహేష్ బాబు మాత్రం ‘బాహుబలి'ని చూసి ఏ మాత్రం బెదరడం లేదని స్పష్టమవుతోంది. బాహుబలి అనేది తెలుగు సినిమా స్టామినా ఏమిటో నిరూపించిన సినిమా. ఆ సినిమాను అధిగమించాలనే రూల్ ఏమీ లేదు. బాహుబలి అనేది ఒక ప్రత్యేకమైన సినిమా, దాన్ని ఇతర సినిమాలతో పోల్చడం సరికాదు అని మహేష్ బాబు అభిప్రాయ పడ్డట్లు సమాచారం.


బాహుబలి సినిమా ప్రభావం ‘శ్రీమంతుడు'పై పడుతుందనే అభిప్రాయాన్ని మహేష్ బాబు కొట్టిరేసారు. ప్రతి సినిమా బాహుబలి కంటే ఎక్కువ వసూలు చేయాల్సిన అవసరం లేదు. నా గత సినిమాలు 70 కోట్ల బిజినెస్ చేసాయి. ఇపుడు నా సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరో 10 కోట్లు వసూలు చేయవచ్చు అని మహేష్ బాబు అన్నట్లు తెలుస్తోంది.

English summary
"Every film need not collect as much as Baahubali. This may give extra mileage to the films that release hereafter. Earlier my movies used to do seventy crores business, now my blockbuster may collect another 10 crores,” Mahesh Babu said.
Please Wait while comments are loading...