నేను‘సూర్యాభాయ్’గా కరెక్టు కాదు:మహేష్
అసలు నేను డాన్ పాత్ర..'సూర్యాభాయ్' చేయడమే కరెక్ట్ కాదనుకోవాలి. ఇలాంటి నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడాన్ని నేను ఓ సవాల్‌గా తీసుకున్నాను. వినోద ప్రధానంగా సినిమా సాగుతుంది కాబట్టి.. ఎంజాయ్ చేస్తూ చేశాను అన్నారు మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ విజియోత్సాహంలో ఉన్న మహేష్ ..మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే దానికి రీజన్ చెపుతూ..సినిమా కొత్తగా ఉంది. ఇప్పటివరకు నేను 'సూర్యాభాయ్'లాంటి పాత్ర చేయలేదు. సినిమా ఫ్రెష్‌గా ఉంది కాబట్టి ప్రేక్షకులకు నచ్చింది.
కొత్త ఫార్మెట్‌లో సాగే సినిమా కాబట్టి.. ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నాను. ఇక ఆశ్లీల డైలాగులు గురించి అంటారా...ఈ డైలాగులు చెబుతున్నప్పుడు వాళ్లు ఇబ్బంది పడతారా? వీళ్లు ఇబ్బంది పడతారా? అని ఆలోచించలేదు. అలా ఆలోచించి ఉంటే ఈ సినిమా చేసి ఉండేవాళ్లం కాదు. ఈ సన్నివేశాలు ఎవర్నీ ఇబ్బందిపెట్టిన దాఖలాలు కూడా లేవు. అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తున్నారు. అయినా సెన్సార్‌వాళ్లు ఆ పదాలు వినిపించకుండా బీప్ చేశారు కదా.. ఇక ప్రాబ్లమ్ ఏముంటుంది అని తేల్చేసారు. రాజకీయాలపై వివిస్పాద డైలాగులు బిజినెస్ మ్యాన్ లో పెట్టడంపై...అవి వివాదాస్పద డైలాగులని మేం అనుకోలేదు. స్క్రిప్ట్‌కి తగ్గ డైలాగులు అనిపించాయి కాబట్టే పెట్టాం. వివాదం అని ఆలోచిస్తే.. చాలా ఉన్నాయి. వాటిని తీసేస్తే సినిమాకి న్యాయం జరగదు అని చెప్పారు.


Click it and Unblock the Notifications