ఇండస్ట్రీలో నెం.1 ఎవరు?....ఇదీ మహేష్ బాబు జవాబు
హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెం.1 ఎవరు? అనే చర్చ తరచూ సాగుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నంత వరకు ఈ ప్రశ్న ఎవరికీ తలెత్త లేదు. అయితే చిరంజీవి సినిమాల నుంచి తప్పుకున్నాక నెం.1 స్థానం ఎవరిది? అనే డిబేట్ తెరపైకి వస్తూనే ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా టాప్ స్టార్ల సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడల్లా మీడియా వారు టాలీవుడ్ టాప్ పొజిషన్ ఎవరిదంటూ హడావుడి చేయడం షరామామూలుగా మారిపోయింది.
తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో హిట్ కొట్టిన మహేష్ బాబుకు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఇదే ప్రశ్ని ఎదురైంది. అందుకు ఆయన చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. నెంబర్ గేమ్ పై తనకు ఆసక్తి లేదని, అసలు తన మదిలో అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదని, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలనే ఆలోచనే గానీ, మరేమీ లేదని సమాధానం ఇచ్చారు.
మరో వైపు మహేష్ బాబు అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ యాడ్ ఫిల్మ్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేంజిలో కంపెనీలు తన వెంట పడటం నిజంగా ఆశ్చర్యమే. మహేష్ బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కూడా ఇందుకు కారణం.
ఇన్ని బ్రాండ్లకు ప్రచారం చేయడంపై మహేష్ బాబు స్పందిస్తూ.....వాళ్ల పనితనం బాగుండి, వాళ్ల వాస్తువులు నాణ్యమైనవి అయితేనే నేను వాటికి ప్రచారం చేస్తున్నాను...అంటూ సమాధానం ఇచ్చారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దు కోవాలి, స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే ఇలాంటి అవకాశాలు వస్తాయి అనే విధంగా సమాధానం ఇచ్చారు ప్రిన్స్.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బేనర్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి 'ఆగడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











