మహేష్ కి తండ్రి నుంచి అబ్బిన లక్షణం
'బిజినెస్ మ్యాన్'లో తొంభైతొమ్మిది శాతం సన్నివేశాల్ని ఒకే టేక్‌లోనే పూర్తి చేసినవే. పేపర్ కూడా చూడకుండా నేను చెప్పినప్పుడే సంభాషణల్ని విని, అలాగే గుర్తుపెట్టుకొని కెమెరా ముందు పలికేవారు. పేజీ, పేజీన్నర ఉన్న సంభాషణలు అవి. ఎంతో జ్ఞాపకశక్తి ఉంటే తప్ప అలా చెప్పలేరు. కృష్ణగారి నుంచి అబ్బిన లక్షణమని నాకు అప్పుడే అనిపించింది అంటున్నారు పూరి జగన్నాధ్. ఈ చిత్రం లో మహేష్ ఫెరఫార్మెన్స్ గురించి చెపుతూ ఆయన అలా స్పందించారు.
అలాగే...'ఎవరికీ తెలియదు కానీ... చిత్రీకరణ మొదలుపెట్టిన పదిహేను రోజులకి మహేష్‌కి ఈ కథ వినిపించాను. అప్పటి వరకు ఆయన ఎలా నటించారో, ఆ తరవాత కూడా అదేస్థాయిలో తెరపై కనిపించారు. 'పోకిరి'కీ, 'బిజినెస్‌మేన్'కీ ఒక నటుడిగా ఆయనలో చాలా మార్పులు గమనించాను అన్నారు. ఇక 'బిజినెస్‌మేన్'వందశాతం మహేష్‌బాబు మార్క్ సినిమానే. ఆయన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ తయారు చేశాను. మహేష్‌లాంటి స్టార్‌తో కాకుండా ఈ కథని వేరొకరితో చేసుంటే ఇంత పెద్ద స్థాయిలో విడుదలయ్యేది కాదు. ఇంతగా ప్రేక్షకులకి చేరువయ్యేది కాదు అన్నారు. మహేష్,పూరీ ఇద్దరూ ఈ చిత్రం సక్సెస్ కావటంతో చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం సీక్వెల్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications