తమిళ శంకర్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా
'పోకిరి'లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మహేష్, ఇలియానాల కలయికలో మళ్ళీ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ త్వరలో ఫలించబోతుంది. ఈ పోకిరి హిట్ పెయిర్ మళ్ళీ ఓ చిత్రం చేయనున్నారు. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ' త్రీ ఇడియట్స్'కు రీమేక్‌గా రూపొందనున్న చిత్రంలో ఈ ఇద్దరు జంటగా కనిపించనున్నారని సమాచారం.
జెమిని ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి దక్షిణాది అగ్ర దర్శకుడు దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్‌తో శంకర్ 'రోబో' చిత్రాన్నిరూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆతర్వాత ఈ చిత్రం ప్రారంభమౌతుంది.
More from Filmibeat
మహేష్ బాబు ఇలియానా శంకర్ పోకిరి రోబో త్రీ ఇడియట్స్ mahesh babu ileana sankar pokiri robo three idiots


Click it and Unblock the Notifications











