వైరల్: హాట్ భామల మధ్యలో సూపర్ స్టార్ మహేష్.. అమ్మాయిలు చూస్తే ఏమైనా ఉందా!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబుకు అమ్మాయిల్లో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మహేష్ ఎప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడే. మహేష్ లుక్స్ అలా ఉంటాయి మరి. మహేష్ బాబు గ్లామర్ రహస్యం అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. దూకుడు సినిమాలో డైలాగ్ ప్రకారం హాలీవుడ్ రేంజ్ కు మహేష్ ఏమాత్రం తగ్గడు. అందుకేనేమో పలు అంతర్జాతీయ బ్రాండ్స్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి. వాణిజ్య ప్రకటనల విషయంలో టాలీవుడ్ హీరోలందరి కంటే మహేష్ ముందుంటాడు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాని దున్నేస్తోంది.

సినిమాలు, యాడ్స్
సినిమాలు, యాడ్స్ రెండింటిని మహేష్ సమంగా ప్లాన్ చేసుకుంటాడు. మహేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బడా కంపెనీలు కోట్లాది రూపాయల ఆఫర్ తో మహేష్ చుట్టూ తిరుగుతుంటాయి.

కళ్ళు చెదిరే లుక్
ఇటీవల ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొన్నాడు. షూటింగ్ పూర్తయ్యాక యూనిట్ సభ్యులతో మహేష్ బాబు ఫొటోకు ఫోజు ఇచ్చాడు. హాట్ లేడీస్ మధ్యలో మహేష్ కళ్ళు చెదిరే స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

వైరల్
ఈ ఫోటో సోషల్ మీడియాని దున్నేస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు చూపు తిప్పుకోలేని విధంగా మహేష్ ఉన్నాడు. ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ పెడుతూ ఈ ఫోటోని ట్రెండింగ్ గా మార్చారు.

వంశీ పైడిపల్లి
సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రతిష్టాత్మకమైన తన 25 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో గడ్డం లుక్ తో మహేష్ కనిపంచబోతున్నాడు. ఆ లుక్ ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











