»   » టాక్స్ తగ్గించుకోవాలనే గ్రామాల దత్తత: మహేష్ బాబుపై దర్శకుడి కామెంట్

టాక్స్ తగ్గించుకోవాలనే గ్రామాల దత్తత: మహేష్ బాబుపై దర్శకుడి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘శ్రీమంతుడు' సినిమా ద్వారా మహేష్ బాబు ఒక మంచి మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లారు. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు... తమ సొంతూర్లను, వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరుచాలనే కాన్సెప్టును సినిమాలో చెప్పడమే కాదు... పలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా చూసి ఇన్ స్పైర్ అయి పలువురు ప్రేక్షకులు, ఇతర స్టార్స్ కూడా గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

mahesh babu

అయితే దర్శకుడు తేజ మహేష్ బాబు చేస్తున్న ఈ పనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు ఇన్ కం టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాలను దత్తత తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు తేజ మీద భగ్గుమన్నారు.

నీకు చాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో మహేష్ బాబు, అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇలా అనడం సబబు కాదు. అందుకే నువ్వు టాలెంట్ ఉండి కూడా ఇలా దిగజారి పోయావ్ అంటూ మహేష్ బాబు అభిమానులు మండి పడుతున్నారు. హోరా హోరీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన తేజ మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు గురించి ఇలా కామెంట్ చేసారు.

English summary
"Mahesh Babu Adopted Villages For Income Tax Deduction" said Teja.
Please Wait while comments are loading...