చిరంజీవి తర్వాత మహేష్ బాబుకే ఆ గౌరవం!
హైదరాబాద్: చిరంజీవి తర్వాత మెగాస్టార్ స్థానం ఎవరికి? అని టాలీవుడ్లో ఆసక్తికర చర్చ సాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ప్రముఖ జాతీయ మేగజైన్ 'ఇండియా టుడే' వారు మహేష్ బాబుపై 120 పేజీల స్పెషల్ ఎడిషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మొత్తం మహేష్ బాబు గురించే చర్చ ఉంటుంది.
గతంలో చిరంజీవిపై 2003లో ఒకసారి, 2008లో ఒకసారి ఇలాంటి స్పెషల్ ఎడిషన్ రిలీజైంది. చిరంజీవి తర్వాత ఆ ఘనత దక్కించుకున్న హీరో కేవలం మహేష్ బాబు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మహేష్ బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ స్పెషల్ ఎడిషన్ ప్రతులు భారీ సంఖ్యలో రిలీజ్ చేయనున్నారట.
మహేష్ బాబు ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకెళ్లడంతో పాటు... ఎండార్స్ మెంట్ల విషయంలో టాలీవుడ్లో ఏ హీరో కూడా అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు. పెద్ద కంపెనీలు మహేష్ బాబుతో ప్రచారం చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. సినిమాల్లో సంపాదించినదానికంటే ఎక్కువగా మహేష్ బాబు వీటి ద్వారా సంపాదిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అఫ్ కోర్స్ ప్రేక్షకుల అభిమానం మెండుగా ఉండబట్టే మహేష్ బాబుకు ఈ రేంజిలో డిమాండ్ ఉందనేది కాదనలేని సత్యం.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అదే విధంగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రానికి కూడా మహేష్ బాబు కమిట్ అయ్యాడు.


Click it and Unblock the Notifications