పూరి దర్శకత్వంలో మహేష్ బాబు మరోసారి!

By Bojja Kumar

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'పోకిరి' చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన 'బిజినెస్ మేన్' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.....పూరి-మహేష్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, పూరి సినిమా కోసం మహేష్ బాబు 60 కోజుల కాల్షీట్ కూడా ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో మహేష్ పలు యాడ్ ఫిల్మ్స్ షూటింగుల్లో బిజీగా గడపనున్నాడు ఆ తర్వాత సుకుమార్ తో సినిమా పూర్తి చేసి, అనంతరం పూరి జగన్నాథ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు.

ఇక పూరి జగన్నాథ్ విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X