వెంటనే అదే నిర్మాతలతో సినిమా చేయటానికి మహేష్ గ్రీన్ సీగ్నల్
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న 'దూకుడు' సినిమా నిర్మాతలకే నెక్స్ట్ సినిమాకు సైతం డేట్స్ ఇచ్చాడని సమాచారం. దూకుడు పూర్తవగానే మహేష్ బాబు ఈ చిత్రంలోనే నటించనున్నట్టు చెబుతున్నారు.ఆ నిర్మాతలతో టెర్మ్స్, పద్దతి నచ్చిన మహేష్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఇక ఈ క్రేజీ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు సుకుమార్. నాగచైతన్యతో '100% లవ్' సినిమా రూపొందించి ఘన విజయం సాధించిన దర్శకుడు సుకుమార్ ఒక్కసారిగా మంచి డిమాడ్ లోకి వచ్చేశాడు. ఈ నేపథ్యంలో, గతంలోనే కమిట్ అయిన మహేష్ బాబు ప్రాజక్టునే సుకుమార్ ముందుగా చేబట్టనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు, మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











