మహేష్‌ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త

By Srikanya

హైదరాబాద్ : మహేష్,పూరీ కాంబినేషన్ ఎప్పుడూ క్రేజే. వీరి కాంబినేషన్ లో చిత్రం చేయటానికి నిర్మాతలు ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తూనే ఉంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని,అభిమానులను అలరించటానికి 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌'ల తరవాత మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ కలయికలో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూరి కథాంశాన్ని మహేష్‌కి వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగాయని సమాచారం. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్‌బాబు నిర్మిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

2013 వేసవి లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం రేసీ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ హిట్టవగానే వెంటనే పూరీ జగన్నాధ్ తను మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం చేస్తున్నానని ప్రకటించారు. అంతేగాక తాను ఓ లైన్ కూడా రెడీ చేసానని ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని విడుదల చేస్తాను అన్నారు. అయితే ఆయన వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ ఆ విషయమే ఎత్తటం లేదు. దాంతో రకరకాల అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫద్యంలో ఆయన మీడియాతో ఈ విషయమై క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ మ్యాన్ 2 సినిమా ఇక లేనట్టే. ఆ స్థానంలో మహేష్‌ కోసం కొత్త కథ రాస్తా అన్నారు. కాబట్టి ఈ చిత్రం ఓ కొత్త కథ అని తెలుస్తోంది.

కెమెరామెన్ గంగతో మంచి ఊపు మీద ఉన్న పూరీ జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ తో తదుపరి చిత్రం హడావిడిలో ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్ తో అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .

ఇక 'దూకుడు', 'బిజినెస్‌ మేన్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలతో విజయపరంపర కొనసాగిస్తున్నారు మహేష్‌ బాబు. ఇప్పుడాయన సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. కృతి ససన్‌ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. అనిల్‌ సుంకర, గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మహేష్‌ సినిమాకి దేవిశ్రీ స్వరాలు అందించడం ఇదే తొలిసారి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X