మహేష్ బాబు, అల్లరి నరేష్ సినిమా ఇద్దరు స్నేహితుల కథ!
ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకేక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్‌కి 25 సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా నటించనున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అల్లరి నరేష్ , మహేష్ బాబు ఫ్రెండ్స్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
అల్లరి నరేష్, మహేష్ బాబు ఆమధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథగా తెలుస్తోంది. గమ్యం , శంభో శివ శంభో సినిమాల్లో నరేష్ చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత అల్లరి నరేష్ కు ఆ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది అవుతుందని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్‌కు స్నేహితుడి పాత్రకు నరేష్ చాలా బాగా సెట్ అవుతాడనడంలో సందేహంలేదు. ఎందుకంటే ఇద్దరూ ఇంచుమించుగా ఒకే ఎత్తులో ఉంటారు. జూన్ 7వ తేదీ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని స్వయంగా మహేష్ బాబు చెప్పడం జరిగింది. దిల్ రాజు - వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











