»   » హాలిడే మూడ్ : మహేష్, బన్నీ, బాలయ్య ఇంకా ఇతర స్టార్స్ (ఫోటోస్)

హాలిడే మూడ్ : మహేష్, బన్నీ, బాలయ్య ఇంకా ఇతర స్టార్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' మూవీ రిలీజ్ అయిన వెంటనే ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, ఇద్దరు పిల్లలు గౌతం, సితార వెకేషన్లోనే గడిపేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల రోజుల్లో యూకెలోని వివిధ ప్రాంతాల్లో వారు పర్యటిస్తున్నారు.

  మరో వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్ తో కలిసి టర్కీ వెళ్లారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా చేసారు. కొన్ని ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

  ఇక నటి మంచు లక్ష్మి ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ, వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ బిజీగా గడుపుతోంది.

  నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్నారు. ఆయన యూఎస్ఏ వెళ్లింది ప్రత్యేకంగా కేవలం హాలీడే ఎంజాయ్ చేయడానికి మాత్రం కాదు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కోసం నిధుల సేకరణ, అభిమానులతో మీటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడే జరుగబోతున్నాయి. బాలయ్య వెంట ఆయన భార్య వసుంధర దేవి కూడా ఉన్నారు. అక్కడ పనులన్నీ పూర్తయిన తర్వాత రెండ్రోజులు ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెకేషన్ వెల్లే అవకాశం ఉంది.

  రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని ప్రస్తుతం న్యూయార్కులో వర్కింగ్ హాలిడు గడుపుతున్నారు. మరో నటి రితూ వర్మ తన న్యూయార్క్ హాలిడేకు సంబంధించిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసారు.

  సెలబ్రిటీస్

  సెలబ్రిటీస్

  పలువురు సెలబ్రిటీలంతా వేసవి సీజన్లో తమకు నచ్చిన విధంగా హాలిడే ప్లాన్ చేసుకున్నారు.

  మహేష్ బాబు

  మహేష్ బాబు

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్లో ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

  యూకె

  యూకె

  యూకె రాజధాని లండన్ తో పాటు కంట్రీలోని వివిధ ప్రాంతాలను మహేష్ బాబు ఫ్యామిలీ సందర్శిస్తున్నారు.

  బన్నీ

  బన్నీ

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టర్కీలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.

  మహేష్ అండ్ ఫ్యామిలీ

  మహేష్ అండ్ ఫ్యామిలీ

  లండన్ వెకేషన్లో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ...

  బాలయ్య

  బాలయ్య

  నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్నారు.

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్ కొన్ని రోజులైతే మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోతారు. అందుకే ఇపుడు భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

  టర్కీ

  టర్కీ

  ఇటీవల టర్కీ వీసా తీసుకున్న అనంతరం...తన కోసం ప్రత్యేకంగా వీసా జారీ చేసిన టర్కిష్ కాన్సోలేట్ కు బన్నీ థాంక్స్ చెప్పారు.

  మంచు లక్ష్మి

  మంచు లక్ష్మి

  మంచు లక్ష్మి ప్రస్తుతం టోక్యోలో గడుపుతోంది.

  బుల్లెట్ ట్రైన్

  బుల్లెట్ ట్రైన్

  టోక్యోలో బుల్లెట్ ట్రైన్ లో మంచు లక్ష్మి ప్రయాణం.

  ఉపాసన

  ఉపాసన

  ఉపాసన ప్రస్తుతం వర్కింగ్ హాలిడేలో భాగంగా న్యూయార్కులో ఉన్నారు.

   బన్నీ

  బన్నీ

  బన్నీ హాలీడే కు సంబంధించిన ఫోటో...

  బాలయ్య బిజీ

  బాలయ్య బిజీ

  ప్రస్తుతం బాలయ్య క్యాన్సర్ ఆసుపత్రి కోసం నిధుల సేకరణ పనిలో ఉన్నారు.

  స్వాగతం

  స్వాగతం

  బాలయ్య అమెరికాలో అభిమానుల నుండి గ్రాండ్ వెల్ కం లభించింది.

  అభిమానులతో...

  అభిమానులతో...

  అమెరికాలో అభిమాన సంఘాలతో కలిసి బాలయ్య చర్చలు జరుపుతున్నారు.

  రీతూ వర్మ

  రీతూ వర్మ

  మరో టాలీవుడ్ నటి రీతూ వర్మ కూడా ప్రస్తుతం న్యూయార్కులో గడుపుతోంది.

  ఫోటోస్

  ఫోటోస్

  తన హాలిడే ట్రిప్ కు సంబంధించని ఫోటోలు రీతూ వర్మ అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

  న్యూయార్క్

  న్యూయార్క్

  న్యూయార్కులో బాగా బిజీగా ఉన్న ఓ స్ట్రీట్ లో రీతూ వర్మ సెల్ఫీ.

  English summary
  Superstar Mahesh Babu has flown to London post the release of Brahmotsavam along with his wife Namrata Shirodkar and Kids, Gautham and Sitara. The month-long vacation is apparently exclusive to meet family and friends in UK and trip around the country. On the other hand, Allu Arjun is also touring along with his wife and son in Turkey. "I would like to Thank the Turkish Consulate for the Personal Honors.", he recently tweeted after receiving the visa.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more